ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, నిరుద్యోగులను నమ్మించి మోసగించారని తెలుగు దేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు విమర్శించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలనపై అన్ని వర్గాల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, వారంతా మార్పు కోరుతున్నారని ఆయన పేర్కొన్నారు. నర్సీపట్నం నియోజకవర్గ పార్టీ నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిని చిన్ని లముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, నిరుద్యోగులను నమ్మించి మోసగించారని విమర్శించారు.క్ష్మీకుమారిని అయ్యన్నపాత్రుడు పరిచయం చేశారు.
ఈ సందర్భంగా అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ.. అలాగే, నర్సీపట్నం నియోజకవర్గంలో అమరావతి రైతుల పాదయాత్ర ఆగబోదని స్పష్టం చేశారు. తెలంగాణలో వైఎస్ షర్మిల, దేశవ్యాప్తంగా రాహుల్‌గాంధీ పాదయాత్ర చేస్తున్నారని.. వారిని ఎవరైనా అడ్డుకుంటున్నారా అని ప్రశ్నించారు. అమరావతి రైతులు పాదయాత్రగా వస్తుంటే.. వారిని అడ్డుకుంటారట.. బుద్ధుందా అని తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. ఏది ఏమైనా, అమరావతి రైతులను స్వాగతిస్తాం.. కాఫీ ఇస్తాం, భోజనం పెడతాం.. వద్దనడానికి మీరెవరు అని అయ్యన్నపాత్రుడు నిలదీశారు. రైతులతో నడిచొస్తే కాళ్లు విరగొట్టేస్తామంటున్నారని.. చూద్దాం ఏం చేస్తారో అని సవాల్ విసిరారు. చిన్ని లక్ష్మీకుమారి మాట్లాడుతూ.. ప్రజల హక్కుల రక్షణ కోసం టీడీపీ పోరాడుతోందన్నారు.