నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మహానంది ఆలయాన్ని మంగళవారం సూర్యగ్రహణం కారణంగా మూసివేశారు. ఉదయం 6 గంటల సమయంలో దేవస్థానం అధికారులు, అర్చకులు ఆలయ ప్రధాన ద్వారాలను మూసివేశారు. గ్రహణ సమయం వీడిన అనంతరం సాయంత్రం 6: 30 గంటల సమయంలో ఆలయ తరుపున తెరచి సంప్రోక్షణ చర్యలు చేపట్టిన అనంతరం ఆలయంలో యధావిధిగా పూజలు జరపనున్నారు. సూర్యగ్రహణం కారణంగా భక్తులకు స్వామి అమ్మవార్ల దర్శన భాగ్యాన్ని నిలిపివేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa