తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నాడని నరసింహ కుమార్ పై మారణాయుధాలతో దాడి జరిగిందని పుంగనూరు టీడీపీ నాయకులూ చల్ల రామచంద్ర రెడ్డి తెలిపారు. గాయపడిన వ్యక్తిని పరామర్శించిన సోదరులు పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాస రెడ్డి (వాసు) . వివరాల్లోకి వెళ్ళితే.... కడప శంకరాపురాని కి చెందిన నరసింహ కుమార్ వృత్తి రీత్యా మెడికల్ ఎక్యూప్మెంట్స్ అమ్మే వ్యాపారం. ఇటీవల తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నాడు. ఇది గిట్టని స్థానిక 7వ డివిజన్ లోని శంకరాపురం కెనరా బ్యాంకు ప్రక్క సందులో మదరిండియా స్కూల్ వద్ద స్థానిక కార్పోరేటర రాజేశ్వరి భర్త ప్రసాద్, అతని అన్న గంగరాజు , వారి తోపాటు వారి అనుచరులు వంశి యాదవ్ యాల్ల మణి కలసి 24 వ తేది దీపావళి పండుగరోజు రాత్రి 10 గంటలకు అక్కడ వున్న నరసింహ కుమార్ తో ఏరా నీవు ఏమన్నా పెద్ద నాయకునివి అనుకుంటున్నావా అంటూ నిష్కారణంగా రాడ్లు ఇతర మారణాయుధాలతో దాడి చేసి నరసింహ కుమార్ ను వెంబడించి తల పై బలంగా కొట్టారు. అన్ని మూసుకొని వుండు లేకపోతేనా పర్యవసానం తీవ్రంగా వుంటుందని హెచ్చరించారు. తీవ్ర గాయాలపాలైన నరసింహ కుమార్ ను చికిత్స కొరకు రిమ్స్ ఆసుపత్రి కి తరలించారు. సంఘటన గురించి తెలుసుకొన్న తెలుగుదేశం పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాస రెడ్డి ఫోన్ చేసి నరసింహ కుమార్ ను పరామర్శించారు దాడి వివరాలను తెలుసుకొన్నారు . అధైర్య పడవద్దని అన్ని విధాలుగా అండగా వుంటామనీ ధైర్యం చెప్పారు. పోలీసులు దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేసి వారిపై కేసు నమోదు చేయ్యాలని డిమాండు చేశారు.