టీ20 ప్రపంచకప్లో టీమిండియాను ఓ సమస్య వెంటాడుతోందని దిగ్గజ బ్యాటర్ సునీల్ గవాస్కర్ అన్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్ ఆందోళనకు గురి చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డాడు. టోర్నీలో ముందడుగు వేయాలంటే ఈ సమస్యను వెంటనే పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని సూచించాడు. కొద్ది రోజులుగా రోహిత్ తన స్థాయికి తగ్గట్లు ఆడటం లేదని చెప్పాడు. అతను ఆడితే ఇతరులకు బ్యాటింగ్ చేయడం ఎంతో సులువవుతుందని పేర్కొన్నాడు.