రబ్బరు ఏరేందుకు అడవిలోకి వెళ్లిన 54 ఏళ్ల మహిళను 22 అడుగుల భారీ కొండచిలువ అమాంతం మింగేసింది. ఇండోనేషియాలోని జాంబీ ప్రాంతంలో జరిగిందీ ఘటన. రబ్బరు ఏరేందుకు అడవిలోకి వెళ్లిన జరా అదృశ్యమైంది. రెండు రోజులైనా జాడ లేకపోవడంతో ఆమె భర్త అడవిలో గాలించాడు. ఓ చోట ఆమె చెప్పులు, జాకెట్, హెడ్స్కార్ఫ్, కత్తి కనిపించాయి. దీంతో ఆయన అధికారులకు సమాచారం అందించాడు. సహాయక సిబ్బందితో కలిసి ఆ ప్రదేశానికి చేరుకున్నాడు. ఆ ప్రాంతానికి కొంత దూరంలో ఓ భారీ కొండచిలువను గమనించారు. దాని కడుపు ఉబ్బెత్తుగా ఉండడంతో అనుమానించారు. అదృశ్యమైన జరాను అది మింగేసి ఉంటుందని భావించారు. గ్రామస్థులందరూ దానిని చంపి పొట్టను చీల్చారు. పూర్తిగా జీర్ణం కాని స్థితిలో ఉన్న మహిళ కళేబరాన్ని బయటకు తీశారు. ఈ వార్త సోషల్మీడియాలో వైరల్గా మారింది.