రైల్వే కోడూరు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు బుధవారం జరగనున్న జాబ్ మేళాను రైల్వే కోడూరు నియోజకవర్గ పరిధిలోని నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని రైల్వే కోడూరు శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు అన్నారు. రైల్వే కోడూరు వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ 18 నుండి 30 సంవత్సరాల లోపు యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఐటిఐ డిప్లమా పీజీ బీటెక్ చదివిన విద్యార్థులు అర్హులని కొరముట్ల తెలిపారు.