సహృదయ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మండలంలోని దేశాయిపేట పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు బుధవారం అల్పాహారం పంపిణీ చేసారు. దేశాయిపేట పంచాయతీ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులకు, పంచాయతీ సిబ్బందికి పులిహోర, పెరుగన్నం అందజేశారు. పారిశుధ్య కార్మికుల నిరుపమానమైనవని, వారిని సమాజంలోని అన్ని వర్గాలు ఆదరించి తమవంతు సాయం అందించాలని ట్రస్ట్ ప్రతినిధులు కోరారు. ఈ కార్యక్రమంలో చుండూరు శ్రీప్రకాష్, ఆకుల ప్రసాదరావు, జవ్వాజి లక్ష్మి పాల్గొన్నారు.