విద్యార్థులలో జ్ఞాపకశక్తి పెంపొందించేందుకు క్విజ్ పోటీలు ఎంతో దోహదం చేస్తాయని, ఈ పోటీల వలన విద్యార్థులలో విజ్ఞానం, సృజనాత్మకత పెరుగుతాయని సైన్సు ఉపాధ్యాయుడు వంకా ప్రభాకరరావు అన్నారు. చీరాలలోని కెజియం గర్ల్స్ హైస్కూలులో పదవ తరగతి విద్యార్థులకు బుధవారం సైన్సు క్విజ్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వంకా ప్రభాకరరావు మాట్లాడుతూ విద్యార్థులకు నిరంతరం పోటీలు నిర్వహించడం వలన ఒత్తిడిని తట్టుకునే శక్తి పెరుగుతుందని, తద్వారా కాంపిటిటివ్ పరీక్షలలో విజయం సాదించగలుగుతారని చెప్పారు. అనంతరం పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు.