రాజధాని కోసం భూమిని త్యాగం చేసిన అమరావతి రైతులపై దాడిచేయడం నీచమైన చర్యఅని మాజీ రాజ్యసభ సభ్యురాలు దుర్గ రామకృష్ణ, మరియు బిజెపి రాష్ట్ర నాయకులు నారాయణస్వామి నాయుడు అన్నారు. మంగళవారం చిత్తూరులో ఏర్పాటు చేసిన మీడియాతో వారు మాట్లాడుతూ పాదయాత్రను అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. వైసీపీ నాయకులు ప్రాంతీయ ముసుగులో రౌడీలను ఉసిగొల్పి రైతులపై దాడిచేయడమే కాకుండా పోలీసులతో పాదయాత్రను అడ్డుకోవడం దారుణమన్నారు.