గిరిజన సంక్షేమం కొరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చిత్తశుద్ధితో అడుగులు వేస్తోందని ప్రభుత్వ విప్, రైల్వే కోడూరు శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు అన్నారు. బుధవారం రైల్వే కోడూరు లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ గిరిజన ప్రాంతాలలో వైద్య సేవలు అందించేందుకు కొత్తగా 104, 108 వాహనాలు సమకూరుస్తున్నామని ఆయన అన్నారు. గిరి పుత్రుల కోసం 246 కోట్లతో 5 మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు, వేయి కోట్ల రూపాయలతో పార్వతిపురం, మన్యం, పాడేరు ప్రాంతాలలో ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తున్నామని ప్రభుత్వ విప్ కొరముట్ల తెలిపారు.