ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్ రాజ్ లో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎస్యూవీ వాహనం విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో నలుగురు మహిళలు, ఓ చిన్నారి మృతి చెందగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. హాండియా టోల్ ప్లాజా సమీపంలో కారు అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో ఈ ఘటన చోటు చేసుకుంది.