ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ రైల్వే స్టేషన్ లో ఓ యువకుడు రైలు పైకి ఎక్కాడు. అక్కడే ఉన్న రైల్వే పోలీసులు, ప్రయాణికులు ఎంత చెప్పినా అతడు అక్కడే నిల్చున్నాడు. ఇంతలో హైటెన్షన్ విద్యుత్ వైర్ తగిలి యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. యువకుడిని వెంటనే జిల్లా ఆస్పత్రికి తరలించారు. సోమవారం ఉ. 9 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. యువకుడిని జాంజ్‌గిర్ ప్రాంతానికి చెందిన రవిగా గుర్తించారు. అతడు పంజాబ్‌లో కూలీగా పని చేస్తున్నాడని, దీపావళికి ఇంటికి వెళ్తుండగా ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa