నరసరావుపేట: కార్తీక మాసం తొలి రోజైన బుధవారం కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి దేవస్థానంలో భక్తుల రద్దీ నెలకొంది. సూర్యగ్రహణం వల్ల మంగళవారం ఉదయం 9 గంటల నుంచి ఆలయాన్ని మూసివేశారు. బుధవారం ఉదయం సంప్రోక్షణ అనంతరం స్వామి దర్శనానికి అనుమతించారు. అభిషేకాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఉచిత దర్శనం క్యూలో రద్దీ కనిపించింది.