ప్రతిపక్షాల కుట్రలను తిప్పికొట్టాలని రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు పిలుపునిచ్చారు. రేగిడి ఆమదాలవలస మండలం, పెద్దశిర్లాం గ్రామ పంచాయితీ, గ్రామ సచివాలయ పరిధిలో బుడితిపేట గ్రామంలో ఎమ్మెల్యే కంబాల జోగులు, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటా పర్యటించి వైయస్ జగన్ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాల గురించి ఆరా తీశారు. ప్రజల కోసం పని చేస్తున్న ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డిని గద్దెదించాలన్న ఆలోచన చేస్తున్న ప్రతిపక్షాలకు ఆ ప్రజలే సరైన బుద్ధి చెప్పాలని రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు పిలుపునిచ్చారు. అధికారంలో ఉండగా ఏమీ చేయలేని చంద్రబాబు.. ఇప్పుడు జరుగుతున్న మంచిని అడ్డుకునే కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.