ప్రధాని మోదీ వచ్చే నెల 11వ తేదీన విశాఖపట్నం రానున్నట్లు తెలిసింది. భోగాపురం విమానాశ్రయానికి శంకుస్థాపన చేయడంతో పాటు పలు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు చేస్తారని బీజేపీ నేతలు అంటున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం. ఆయన విశాఖలో రూ. 400 కోట్లతో రైల్వే స్టేషన్ పునర్మిర్మాణ పనులు ప్రారంభిస్తారు. హెచ్పీసీఎల్ రూ. 22 వేల కోట్లతో చేపట్టిన విస్తరణ పనులను కూడా ప్రధాని ప్రారంభిస్తారని సమాచారం. దీనిపై రెండ్రోజుల్లో స్పష్టత వస్తుందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీవీఎన్ మాధవ్ తెలిపారు.