దేశవ్యాప్తంగా సీఎం వైయస్ జగన్ ట్రెండ్ సెట్ చేశారని స్పీకర్ తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి బీసీల కోసం ఎన్నో పథకాలు అమలు చేశారని తెలిపారు. తాడేపల్లిలో నిర్వహిస్తున్న వైయస్‌ఆర్‌సీపీ బీసీ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. రియల్ ఎస్టేట్ కోసమే అమరావతి రైతులు పాదయాత్ర చేస్తున్నారని విమర్శించారు. రియల్టర్ల ప్రయోజనాలే చంద్రబాబుకు ముఖ్యమని మండిపడ్డారు. అలానే బీసీ బిల్లు పెట్టించిన ఘనత సీఎం వైయస్ జగన్‌దేనని ఎంపీ ఆర్.కృష్ణయ్య యాదవ్ తెలిపారు. 56 కార్పొరేషన్లతో బీసీలకు గుర్తింపు వచ్చేలా చేశారని చెప్పారు.