సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందించడమే ప్రభుత్వ లక్ష్యమై ఎమ్మెల్యే మాల గుండ్ల శంకరనారాయణ సూచించారు. శ్రీ సత్య సాయి జిల్లా పరిగి మండలం కాలువపల్లి లో గురువారం గడపగడపకు-మన ప్రభుత్వ కార్యక్రమంలో ఆయన పాల్గొనిగడపగడపకు వెళ్లి ప్రభుత్వ ప్రవేశపెడుతున్న పథకాలు అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. పథకాలు అందని వారు సచివాలయాన్ని సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.