ఏపీలో జనసేన, బీజేపీ పొత్తు విషయంపై ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మరోసారి క్లారిటీ ఇచ్చారు. జనసేనతో తమ పొత్తు కొనసాగుతుందని చెప్పారు. అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారంటూ వీడియో విడుదల చేశారు. జనసేనకు దూరంగా ఉండాలని బీజేపీ నిర్ణయించినట్లు ప్రచారం చేస్తున్నారని, ఆ వార్తలను ఖండిస్తున్నానని సోము వీర్రాజు స్పష్టం చేశారు. ఎప్పుడూ జనంతో పొత్తు, జనసేనతో పొత్తు అనే మాటనే తాను మాట్లాడుతున్నానని చెప్పారు.