టీ20 వరల్డ్ కప్ లో భారత్ మరో విజయం సాధించింది. రెండో మ్యాచ్‌లో నెదర్లాండ్స్ మీద ఈజీ విక్టరీ కొట్టింది. సిడ్నీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో నెదర్లాండ్స్‌పై 56 పరుగుల తేడాతో ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. రోహిత్ శర్మ (39 బంతుల్లో 53, 4 ఫోర్లు, 3 సిక్సర్లు), విరాట్ కోహ్లీ (44 బంతుల్లో 62 నాటౌట్, 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ల క్లాస్ ఆటకు తోడు చివర్లో సూర్యకుమార్ యాదవ్ (25 బంతుల్లో 51, 7 ఫోర్లు, 1 సిక్స్) ఊరబాదుడు తోడై నిర్ణీత 20 ఓవర్లలో భారత్.. 2 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. 180 పరుగుల లక్ష్య ఛేదనలో నెదర్లాండ్స్.. 9 వికెట్ల నష్టానికి 123 పరుగులకే పరిమితమైంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa