తనపై జరిగే తపుడు ప్రచారంపై నారా బ్రహ్మిణి న్యాయ పోరాటానికి సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలావుంటే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సతీమణి బ్రాహ్మణి పై తప్పుడు ప్రచారం జరుగుతోందని మండిపడింది టీడీపీ. దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత పేరు మీద హైదరాబాద్‌లో ఉన్న ఫామ్‌హౌస్‌ను బ్రాహ్మని కొనుగోలు చేశారని సోషల్ మీడియాలో ట్వీట్‌లు, పోస్టులు వైరల్ అయ్యాయి. ఏకంగా రూ.1600 కోట్లతో ఫామ్‌హౌస్ కొనుగోలు చేశారని టార్గెట్ చేశారు. అయితే ఇదంతా ఫేక్ అంటోంది టీడీపీ.
‘తన పైనా, తన భార్య పైనా ఎవరు ఏ ఆరోపణలు చేసినా పోలీసు బలగాన్ని పంపి కేసులు పెట్టించే జగన్ రెడ్డి.. స్వర్గీయ ఎన్టీఆర్ కుటుంబ మహిళలపై ఫేక్ ప్రచారాలు చేయిస్తున్నాడు. తనకో ధర్మం ఎదుటివాళ్లకు ఇంకో ధర్మం ఏంటో తేల్చుకోడానికి రంగం సిద్ధమవుతోంది. నారా బ్రాహ్మణి గారు నిరుపేద అని, అటువంటి మహిళ రూ.1600 కోట్లతో దివంగత జయలలితకు చెందిన ఫార్మ్ హౌస్ ను కొన్నారని.. అంతటి డబ్బు ఆమెకు ఎక్కడిది అంటూ వైసీపీ పేటీఎం బ్యాచ్ లో కొందరు ఫేక్ పోస్టులు పెట్టారు. వారిపై పరువు నష్టం దావా వేసేందుకు నారా బ్రాహ్మణి సిద్ధం అవుతున్నారు’అని టీడీపీ క్లారిటీ ఇచ్చింది. న్యాయ పోరాటానికి సిద్ధమయ్యారని.. పోస్టులు పెట్టినవారిపై త్వరలోనే పరువు నష్టం దావా వేస్తున్నట్లు తెలిపారు.
రెండు, మూడు రోజులుగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సతీమణి బ్రాహ్మణిపై సోషల్ మీడియాలో ఓ ప్రచారం జరిగింది. బ్రాహ్మణి హైదరాబాద్‌లో తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు ఓ ఫామ్‌హౌస్ కొనుగోలు చేశారని ట్వీట్‌లు, పోస్టులు వైరల్ అయ్యాయి. ఆ ఫామ్‌హౌస్‌ను రూ.1600 కోట్లు పెట్టి కొనుగోలు చేశారని ప్రచారం చేశారు.
ఇప్పటికే ఇదంతా తప్పుడు ప్రచారమని ఫ్యాక్ట్ చెక్ టీడీపీ అనే ట్విట్టర్ అకౌంట్ ట్వీట్ చేయగా.. ఆ ట్వీట్‌ను టీడీపీ అఫిషియల్ అకౌంట్ నుంచి రీ ట్వీట్ చేశారు. ఇదంతా ఓ ప్లాన్ ప్రకారం తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలుగు దేశం పార్టీ చెబుతోంది. ఫామ్‌హౌస్ పేరుతో జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని.. నారా బ్రాహ్మణి ఏకంగా పరువు నష్టం దావా వేయడానికి సిద్ధమయ్యారని చెబుతున్నారు.
హైదరాబాద్ సమీపంలోని మేడ్చల్ దగ్గర్లో దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలితకు ఓ పెద్ద ఫామ్ హౌస్ ఉందట. ఆ ఫామ్ హౌస్‌కు జేజే గార్డెన్ అనే పేరు ఉందట.. ఏకంగా 25 ఎకరాల వరకు స్థలం ఉందని చెబుతున్నారు. ఈ ఫామ్‌హౌస్ పేరు ఇటీవల మారిపోయిందని టాక్ వినిపిస్తోంది. ఈ ఫామ్ హౌస్ దగ్గర మరో కంపెనీకి చెందిన ఆస్తిగా ఓ బోర్డును ఏర్పాటు చేశారట. అందుకే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. అక్కడితో ఆగకుండా ఫామ్‌హౌస్ కొనుగోలు చేసన ఆ కంపెనీ ప్రతినిధులు బ్రాహ్మిణికి తెలిసినవారిని మరికొందరు ప్రచారం చేస్తున్నారు. దీంతో టీడీపీ ఇదంతా తప్పుడు ప్రచారమని క్లారిటీ ఇచ్చింది.