బీహార్‌లోని ఔరంగాబాద్‌లో విషాధ ఘటన జరిగింది. నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాహెబ్‌గంజ్‌లోని తెల్లవారుజామున 2:30 గంటలకు ఒక కుటుంబం ఛత్ పూజ కోసం వంట చేస్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది. గ్యాస్ సిలిండర్ పేలడంతో 30 మందికి పైగా గాయపడ్డారు. మంటలను ఆర్పే ప్రయత్నంలో ఏడుగురు పోలీసు సిబ్బందికి కూడా కాలిన గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.