మేఘాలయ ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ షిల్లాంగ్లో ఫెడరేషన్ ఆఫ్ ఖాసీ జైంతియా అండ్ గారో పీపుల్ (FKJGP) నిర్వహించిన ర్యాలీ శుక్రవారం హింసాత్మకంగా మారింది. ర్యాలీలో పాల్గొన్న కొందరు బాటసారులపై దాడి చేసి వాహనాలను ధ్వంసం చేశారని అధికారులు తెలిపారు. ర్యాలీకి పోలీసులు ఎస్కార్ట్గా వెళ్లారని, అయినప్పటికీ నిరసనకారులను అదుపు చేయలేకపోయారని తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.