31వ తేదీన జరిగే ఎఐటియుసి ఆవిర్భావ వేడుకలను వాడవాడలా ఘనంగా నిర్వహించాలని ఎఐటియుసి నియోజకవర్గ అధ్యక్షుడు ఆరేటి రామారావు కోరారు. పొన్నూరు కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కష్టించి పని చేసే కార్మికులకు సంపదను సృష్టించే కార్మికులకు, వారి కష్టానికి తగిన ప్రతిఫల ముండాలని హక్కుల సాధనకు ఏర్పాటు చేసిన మొదటి కార్మిక సంఘం ఎఐటియుసి అని చెప్పారు. 1920 అక్టోబరు 31న బొంబాయిలో స్థాపించారని చెప్పారు. ఈ నెల 31న 103వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జరువుకొంటుందన్నారు. ఆంగ్లేయులను మన దేశం నుండి తరిమివేయడానికి జరిగిన పోరాటంలో కార్మికులు ముందుండి నడిచారన్నారు. కార్మికులకు సరియై వేతనాలు, బోనస్, ఎక్స్ గ్రేషియో, పనిగంటలు ఆరోజుల్లోనే ఎఐటియుసి కార్మికులకు సాధించిపెట్టిందన్నారు. ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని పతాకావిష్కరణలు, సభలు, సమావేశాలు నిర్వహించాలని కోరారు. సమావేశంలో సయ్యద్ ఖాసిం, జంపని గోవిందరాజు తదితరులున్నారు.