రీ సర్వే కార్యక్రమంలో మొత్తం 124గ్రామాలకు సంభందించి ఫైనల్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందని, మంగళ వారం లోపున వెర్ఫికేష న్, సర్టిఫికేషన్ కార్యక్రమం పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ అన్నారు. శనివారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమంలో అర్ డి ఓ లు, తఃశిల్డార్లు, సర్వేయర్లు, డి ఐ లు, గ్రామ సర్వేయర్ లతో నిర్వహించారు.ఈ సంద్భర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 1240గ్రామాలకు సంభందించి వెరిఫికేషన్, బై లింగ్యువల్, క్లరికల్ స్థాయి లో పూర్తి చేసి సర్టిఫికేషన్ కార్యక్రమం వేగంగా పూర్తి చేయాలన్నారు.జిల్లాలో పలమనేరు, కుప్పం లలో 102 గ్రామాలకు, చిత్తూరు డివిజన్ పరిధిలో 20గ్రామాలు , నగరి పరిధిలో 02 గ్రామాలున్నాయి. అదేవిధంగా 12గ్రామాలకు సంభందించి సర్వే రాళ్లునాటే ప్రక్రియ చేపట్టాలన్నారు.