విటమిన్లు, ప్రొటీన్లతో నిండిన బాదంపప్పు పూర్తి శక్తి వనరులలో ఒకటి. జ్ఞాపకశక్తిని పెంచుతుందనే ఉద్దేశంతో పిల్లలకు ఎక్కువగా బాదం ఇస్తారు. బాదంపప్పు జ్ఞాపకశక్తిని మాత్రమే కాకుండా మొత్తం మెదడు పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. బాదంలో విటమిన్ E, ఫోలేట్, ఫైబర్లు సమృద్దిగా ఉంటాయి. అధిక కేలరీలు ఉంటాయి. బరువు తగ్గాలి అనుకునేవాళ్లు రోజుకీ నాలుగు నుంచి ఐదు వరకు మాత్రమే తీసుకోవాలి.