కర్ణాటకలో మరో దుమారం రేగింది. దీపావళి సందర్భంగా ముఖ్యమంత్రి కార్యాలయానికి చెందిన ఓ అధికారి కొందరు జర్నలిస్టులకు స్వీట్ బాక్స్‌లతో పాటు రూ.లక్ష నుంచి రూ.2.50 లక్షల వరకు నగదు బహుమతులు ఇచ్చారనే ఆరోపణలు కలకలం సృష్టించాయి. అధికార బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన ఈ 'స్వీట్ బాక్స్ లంచం' పై న్యాయ విచారణ చేపట్టాలని ప్రతిపక్ష కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. మరోవైపు బీజేపీ ఆ ఆరోపణలను తోసిపుచ్చింది.