అచ్చుతాపురం: మండలంలో నాగుల చవితి వేడుకలు శనివారం పలుచోట్ల భక్తిశ్రద్ధలతో జరిగాయి. ఈ ఏడాది రెండు రోజుల తగులు మిగులు రావడం వల్ల ప్రజలలో సందిగ్ధనెలకొంది. శనివారంఉదయం తిధులు ప్రకారం 10: 45 కు చవితి జరుపుకోవచ్చన్న నమ్మకంతో కొంతమంది శనివారం ఉదయం 11: 45 నిమిషాలకు ముందు పుట్లలో పోశారు. పిల్ల పాపలతో నాగదేవతకు పూజలు చేశారు. దుప్పితురు శివారు ముసలమ్మ పాలెం కుండ్రపు వారి ఉమ్మడి కుటుంబ సమేతంగా(హెరిటేజ్ జోనల్ శేషు ) పుట్ట వద్దకు వెళ్లిపాలు పోసి పూజలు చేశారు.