విశాఖ పర్యటన ముగించుకొని తిరిగి ఢిల్లీకి పయనమైన కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు విశాఖ ఎయిర్ పోర్టులో రాజ్యసభ ఎంపి జివిఎల్ నరసింహారావు, ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్, జిల్లా అధ్యక్షులు రవీంద్ర మేడపాటి, మాజీ శాసనసభ్యులు రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణుకుమార్ రాజుతో కలిసి ఎయిర్ పోర్టు అడ్వైజరీ కమిటీ సభ్యులు మరియు గాజువాక నియోజకవర్గ కోఆర్డినేటర్ కరణంరెడ్డి నరసింగరావు శనివారం ఘనంగా వీడ్కోలు పలికారు. విశాఖలో పార్టీ బలోపేతానికి చేస్తున్న కార్యక్రమాలను నిర్మలా సీతారామన్ కు వివరించారు. అలాగే పార్టీ పటిష్టతకు చేయవలసిన సూచనలను, సలహాలను నిర్మలా సీతారామన్ దిశనిర్దేశం చేశారు.