యూపీలోని బండా జిల్లాలో శనివారం ఘోర ప్రమాదం జరిగింది. బస్సు లోయలో పడిపోవడంతో అందులో ఉన్న 13 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఓర్హా-నాగ్వారా సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది. బస్సు డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో ఈ సంఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. బస్సు అట్రారా నుంచి కమాసిన్‌కు వెళ్తుండగా ఈ దుర్ఘటన సంభవించిందన్నారు. ప్రయాణికుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa