ఎస్ఐ స్థాయి అధికారితో జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో పూర్తిస్థాయిలో రౌడీ షీటర్లు, పాత నేరస్తుల కదలికలపై పటిష్ట నిఘా పెట్టామని ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ తెలిపారు. రౌడీ షీటర్లు తమ నేర జీవితానికి ముగింపు పలకాలని లేదంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందని ఎస్పీ హెచ్చరించారు. శాంతిభద్రతలకు భంగం కలిగించడం, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడటం చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.