గత ఏడాది మహిళలను దూషించిన కేసులో ఓ వ్యక్తికి 6 నెలల జైలు, వెయ్యి రూపాయల జరిమానా విధించినట్లు పోలీసులు తెలిపారు. మేడికొండూరు మండలం యలవర్తిపాడులో మహిళను దూషించిన ఘటనపై అప్పట్లో మేడికొండూరు పోలీస్ స్టేషన్ కేసులో గ్రామానికి చెందిన మారెళ్ల నారాయణరావును గుంటూరులోని ఐదో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరచాగా, ఈ మేరకు న్యాయమూర్తి తీర్పు చెప్పారని పేర్కొన్నారు.