మధ్యప్రదేశ్ బాలాఘాట్ జైన మందిరంలో చోరికి పాల్పడ్డ ఓ దొంగ.. అనంతరం పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. దొంగతనం చేసిన వస్తువులను తిరిగి ఇచ్చేయడమే కాక.. క్షమాపణలు చెబుతూ లేఖ కూడా రాశాడు. స్థానిక జైన మందిరంలో గుర్తు తెలియని వ్యక్తి 9 వెండి గొడుగులు, ఒక వెండి జాడీ, 3 ఇత్తడి పాత్రలను ఇటీవల అపహరించాడు. ఈ విషయాన్ని పోలీసులు సీరియస్గా తీసుకోవడంతో భయపడ్డ దొంగ వాటిని గ్రామ పంచాయతీ దగ్గర ఒక సంచీలో వదిలి వెళ్లాడు.