రాళ్లకు రక్తమాంసాలు, ఫీలింగ్స్ ఉండవు. అయితే, ప్రపంచంలో ఒక వింతైన రాయి ఉంది. దాని నుంచి రక్తం కారుతుంది. 'పియురా చిలియెన్సిస్' అని పిలిచే ఈ వింతైన రాళ్లు దక్షిణ అమెరికా దేశాలైన చిలీ, పెరూ సముద్ర అడుగు భాగంలో పెద్దపెద్ద రాళ్లకు అంటుకుని పెరుగుతాయి. వీటిని పీరియడ్ రాక్ అని కూడా అంటారు. నిజానికివి.. చూడ్డానికి అచ్చం రాళ్లలా కనిపించే సముద్ర జీవులు. వీటి పై భాగం గట్టిగా ఉంటుంది. లోపల అంతా మెత్తని మాంసం ఉంటుంది. ఇవి కూడా శ్వాస తీసుకుంటాయి.