గంజాయి వంటి మాదక ద్రవ్యాలకు బానిసలవుతున్న యువతను రక్షించాలని మచిలీపట్నం అదనపు జిల్లా జడ్జి చిన్నంశెట్టి రాజు అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ప్రాంగణంలో జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి పద్మ అధ్యక్షతన జరిగిన జిల్లా పారా లీగల్ వలంటీర్ల శిక్షణ ము గింపు శిబిరంలో న్యాయమూర్తి చిన్నంశెట్టి రాజు మాట్లాడారు. మాదక ద్రవ్యాల కేసుల విచారణ కోసం మచిలీపట్నం, విజయవాడలలో జిల్లా కోర్టులు ఏర్పాటు చేశామన్నారు. జిల్లా తొమ్మిదో అదనపు జిల్లా జడ్జి డాక్టర్ షేక్ మహమ్మద్ ఫజుల్లా, శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ ఎం. రామకృష్ణ, రెండో అదనపు ఫస్ట్‌క్లాస్ మేజిస్ర్టేట్ వి. దేవిసాయి శ్రీవాణి, పీపీ వి.వరదరాజులు ప్రసంగించారు.