‘రైల్వేస్టేషన నిర్మాణ పనుల వద్ద ఏర్పాటు చేసిన విద్యుత బోర్డు ప్రమాదకరంగా ఉంది. దీని వల్ల అపాయం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు’ అంటూ హుబ్లీ డీఆర్‌ఎం హర్ష ఖరే తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఉదయం ఆయన బళ్లారి నుంచి రాయదుర్గం మీదుగా కదిరి దేవరపల్లి వరకు రైల్వే స్టేషనలతో పాటు రైల్వేలైన పరంగా సమస్యలను అధ్యయనం చేశారు. రాయదుర్గం స్టేషనను సందర్శించి కొత్తగా నిర్మిస్తున్న స్టేషన ప్లాట్‌ఫామ్‌తో పాటు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి పరిశీలించారు. కొత్త స్టేషన వద్ద కాంట్రాక్టర్ నేలపై ఏర్పాటు చేసిన విద్యుత బోర్డు వల్ల చిన్నపిల్లలకు అపాయం సంభవించే ప్రమాదం ఉందని, ఇన్ని రోజులు ఎలా అనుమతించారని రైల్వే అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే బోర్డును తొలగించాలని ఆదేశించారు. స్టేషన నిర్మాణం వల్ల పక్కనే ఉన్న వరదనీటి కాలువ సక్రమంగా ఏర్పాటు చేయకపోవడంతో వరద నీరంతా ఇళ్లల్లోకి చేరుతోందని ప్రజలు ఆయనకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన సమస్య ఉన్న ప్రాంతాన్ని సందర్శించి దీనిపై అధ్యయనం చేసి సమస్య పరిష్కరించాలని సూచించారు.