గుంటూరు జిల్లాలో మహిళా అదృశ్యంపై అరండల్ పేట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. బొంగరాల బీడు 5వ లైన్ కు చెందిన కె. ప్రవీణ్ కుమార్, ప్రసన్న లకు 15 సంవత్సరాల కిందట వివాహమైంది. ప్రవీణ్ కుమార్ మద్యానికి బానిసయ్యాడు. భర్తను మద్యం మానమని ప్రసన్న గొడవపడుతుండేది. క్రమంలో 28వ తేదీ రాత్రి ఆమె భర్తకు చెప్పకుండా ఇల్లు విడిచి ఎటో వెళ్లిపోయింది. ఆచూకీ కోసం వెతికినా ఫలితం లేకపోవడంతో ప్రవీణ్ కుమార్ ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు