జిల్లాలో క్రీడా ప్రతిభకు కొదవలేదని, ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటే సత్ఫలితాలు వస్తాయని టీడీపీ తాడిపత్రి మున్సిపల్ చైర్మన జేసీ ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. ఏపీ రాష్ట్రస్థాయి షటిల్ బ్యాడ్మింటన అండర్- 15 బాల బాలికల చాంపియనషి్‌ప పోటీలు స్థానిక స్మాష్ ఇండోర్ స్టేడియంలో ఆదివారం ముగిశాయి. సింగిల్స్ బాలికల్లో దీపిక (గుంటూరు), బాలురలో మహేంద్ర (నెల్లూరు) విజేతలుగా నిలిచారు. డబుల్స్ బాలికల్లో జాశ్విత (విశాఖపట్నం)-సరయు (ప్రకాశం), బాలురలో నిఖిల్ ప్రకాష్ (కర్నూలు), తరుణ్(కర్నూలు) విజేతలుగా నిలిచారు. మిక్స్‌డ్ డబుల్స్‌లో మణికంఠారెడ్డి (గుంటూరు)-జాశ్విత (విశాఖపట్నం)లు గెలిచారు. ముఖ్య అతిథిగా హాజరైన జేసీ ప్రభాకర్‌రెడ్డి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. క్రీడలతో సత్సంబంధాలు, స్నేహపూరిత వాతావరణం నెలకొంటుందన్నారు. క్రీడా స్ఫూర్తితో ఉన్నత స్థానాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. జిల్లా షటిల్ బ్యాడ్మింటన అసోసియేషన కార్యనిర్వాహక అధ్యక్షుడు బుగ్గయ్య చౌదరి, కార్యదర్శి మహ్మద్‌షఫీ, కార్యనిర్వాహక కార్యదర్శి జీవనకుమార్ సంఘం జిల్లా సభ్యులు సాంబమూర్తి, అల్తాఫ్ తదితరులు పాల్గొన్నారు.