స్పందన కార్యక్రమంలో వచ్చే అర్జీలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని బాపట్ల జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ అధికారులను ఆదేశించారు. సోమవారం బాపట్ల కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ స్పందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీలు అర్జీదారుల వద్దకు వెళ్లి సమస్యలు పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్జీదారులను కార్యాలయాలకు పిలువకూడదన్నారు. ప్రజలు ఇచ్చే అర్జీలు గడువులోగా పరిష్కరించాలన్నారు. ప్రతి గురువారం మండల ప్రత్యేక అధికారులు రెండు సచివాలయాలు తనిఖీలు చేయాలని కలెక్టర్ చెప్పారు. సచివాలయాల పరిధిలో రక్తహీనత ఉన్న మహిళలు, శిశువులను గుర్తించి వారికి కావలసిన పౌష్టికాహారం అందించాలన్నారు.