వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని వీఆర్‌ఎస్‌ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పొదల నరసింహులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివా రం స్థానిక సాయిబాబా ఆలయంలో మండల, గ్రామ కమిటీలను నియమించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా వాల్మీకులను ఎస్టీ జాబి తాలో చేర్చాలని ధర్నాలు చేస్తున్నా పాలకులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. పాలకులు ఎన్నికల సమయంలో వాల్మీకులకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కార న్నారు. అనంతరం మండల కమిటీలను మదనపల్లె నియోజకవర్గ అధ్యక్షుడు శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఎంపిక చేశారు. మండల అధ్యక్షునిగా రాచివేటివారిపల్లెకు చెందిన గాధె భాస్కర్ ఎంపిక కాగా ఉపాధ్యక్షులుగా నారాయణ, రామచంద్రలు ఎన్నిక య్యారు. అధికార ప్రతినిధిగా శ్రీరాములు, ట్రెజరర్‌గా నాగరాజ, గౌరవ అధ్యక్షుడిగా కమ్మల నాగప్ప, మహిళా విభాగం అధ్యక్షురాలిగా రెడ్డిరాణి, ఉపాధ్యక్షులుగా శ్యామల ను ఎంపిక చేశారు. కార్యక్రమంలో వాల్మీకులు, శ్రీరాములు, వెంకటరమణ, సరోజమ్మ, రెడ్డిరాణి, జయసింహ, శంకర, రెడ్డిశేఖర, రామచంద్ర, నరసింహులు, ప్రసాద్, గాత, గంగరాజు తదితరులు పాల్గొన్నారు.