ఆచంట,వల్లూరు రాపాకవారి పాలెంలో ఆదివారం ఉదయం జరిగిన ప్రమాదంలో రెండు ఇళ్ళు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఖండవల్లి శ్రీరాములు ఇంటి నుంచి మంటలు వచ్చినట్లు స్థానికులు తెలిపారు. శ్రీరాములు, ఖండవల్లి నరసింహమూర్తి ఇళ్లు కాలిపోయాయి. శ్రీరాములు ఉదయం పొలం పనులకు వెళ్లగా అతని కుమారులు శ్రీనివాసరావు, బాల మహేంద్రరావు బందువుల ఇంటికి వెళ్లా రు. ఖండవల్లి నరసింహమూర్తి, కుమారుడు కూడా ఇటీవల మృతి చెందారు. ఒంటరిగా మిగిలిన మార్తమ్మ కోనసీమ జిల్లా తాటిపాక బంధువుల ఇంటికి వెళ్లిం ది. ప్రమాదానికి కారణాలు తెలియలేదు. స్థానికులు పాలకొల్లు అగ్నిమాపక కేం ద్రానికి సమాచారం ఇవ్వడంతో సిబ్బంది మంటలు అదుపు చేసేసరికి ఇళ్లు దగ్ధమ య్యాయి. బాధిత కుటుంబాలు కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. కూత వేట దూరం లో గంగోలు నరసింహరావు ఇంటిపై స్వల్పంగా మంటలు రావడంతో బకెట్‌తో నీళ్లు చల్లి అదుపు చేశారు. దీంతో అగ్నిప్రమాదంపై పలు అనుమానాలు వ్యక్త మవుతున్నాయి. ఎస్‌ఐ బీఎస్‌డీ.ప్రసాద్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి బాధితు లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలను ఏఎంసీ చైర్మన్ లావణ్య, సర్పంచ్ నేలపూడి బేబి రామ్మోహనరావు, సీపీఎం నేత ఇందుకూరి సూర్యనారాయణరాజు, బొర్రా ధర్మారావు, ముప్పాల వెంక టేశ్వరరావు, చిట్టూరి శ్రీనివాస్ తదితరులు పరామర్శించారు.