ఎంటర్టైనర్ అంతా ఒకే ప్యాకేజీలో వచ్చేస్తే ఇంకా కావాల్సింది ఏముంటుంది...? బ్రాడ్ బ్యాండ్ ఒకటి, డీటీహెచ్ ఒకటి, మళ్లీ ఓటీటీ ఇలా వేటికవే విడిగా ప్లాన్లు తీసుకోవడం వల్ల అధిక చార్జీల భారం పడుతుంది. దీనికంటే ఎయిర్ టెల్ వీటన్నింటినీ కలిపి అందిస్తున్న కాంబో ప్లాన్లు ఆకర్షణీయంగా ఉన్నాయి.
రూ.699
ఇది ప్రీపెయిడ్ ప్లాన్. బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్, ల్యాండ్ లైన్ కనెక్షన్ ఇందులో భాగంగా వస్తాయి. 40ఎంబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్ లభిస్తుంది. అలాగే, 300 టీవీ చానల్స్ లభిస్తాయి. డిస్నీ హాట్ స్టార్, సోనీ లివ్, ఎయిర్ టెల్ ఎక్స్ ట్రీమ్ తోపాటు మరో 12 ఓటీటీ యాప్స్ ను ఉచితంగా పొందొచ్చు.
రూ.899
105జీబీ డేటా, అన్ లిమిటెడ్ కాలింగ్ ఆప్షన్ తో రెండు పోస్ట్ పెయిడ్ కనెక్షన్లు లభిస్తాయి. 350 టీవీ చానళ్లు, అమెజాన్ ప్రైమ్, డిస్నీ హాట్ స్టార్ సహా అన్ని ప్రముఖ ఓటీటీ యాప్స్ సబ్ స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది.
రూ.1098
100 ఎంబీపీఎస్ వేగంతో నెట్, 75జీబీ ఇంటర్నెట్ తో పోస్ట్ పెయిడ్ కనెక్షన్ లభిస్తాయి. అన్ని ప్రముఖ ఓటీటీల సబ్ స్క్రిప్షన్ ఉచితం. వీటితోపాటు రూ.1099, రూ.1599, రూ.1799, రూ.2299 ప్లాన్లు కూడా ఉన్నాయి.