ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్లాస్టిక్‌ ఫ్లెక్సీలపై నిషేధం వాయిదా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Nov 01, 2022, 11:09 AM

ఏపీలో ప్లాస్టిక్‌ ఫ్లెక్సీలపై నిషేధం వాయిదా వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నవంబర్ 1వ తేదీ నుంచి ప్లాస్టిక్‌ ఫ్లెక్సీలపై నిషేధం విధిస్తూ ప్రభుత్వం గతంలో ఉత్తర్వులు ఇచ్చింది. నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా విధిస్తామని హెచ్చరించింది. అయితే ఈ నిషేధాన్ని జనవరి 26 నుంచి అమలు చేయనున్నట్లు ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. ఫ్లెక్సీ తయారీదారులు విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com