ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఇక నుంచి ట్విట్టర్ సీఈఓగా వ్యవహరించనున్నారు. ఇప్పటికే ఆయన టెస్లా, స్పేస్ ఎక్స్, న్యూరాలింక్ కంపెనీలకు ఆయన సీఈఓగా ఉన్నారు. ఇక ట్విట్టర్ విషయంలో ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. ట్విట్టర్ డైరెక్టర్ల బోర్డును తాజాగా రద్దు చేశారు. ట్విట్టర్‌లో ఇక నుంచి ఏకైక డైరెక్టర్‌గా ఆయన కొనసాగనున్నారు. 44 బిలియన్ డాలర్లు వెచ్చించి ట్విట్టర్‌ను ఆయన సొంతం చేసుకున్నారు.