భీమవరం దగ్గరున్న తాడేరు వంతెన నిర్మాణం తక్షణమే చేపట్టాలని జనసేనపార్టీ ఆధ్వర్యంలో జనసేన నాయకులూ భారీ ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో JSP నాయకులు కొటికలపూడి గోవిందరావు, బొమ్మిడి నాయకర్, కనకరాజు సూరి, గుండా జయప్రకాష్ నాయుడు గార్లు, తదితరులు, జనసైనికులు, ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు. ప్రజలకి అవసరమయ్యే ఇలాంటి నిర్మాణాలు చేపట్టకుండా, అవసరాలు,, సమస్యలు చెప్పుకున్న వారి మీద ఎదురు దాడి చేస్తూ... పోలీస్ కేసులు పెట్టించడం సబబు కాదు అని హెచ్చరించారు.