రాజస్థాన్లోని జైపూర్లో అమానవీయ ఘటన జరిగింది. ఆడపిల్లకు జన్మనిచ్చిన ముస్లిం మహిళకు ఆమె భర్త ట్రిపుల్ తలాక్ చెప్పాడు. సనానాజ్, అమానుల్లాలకు 2020లో పెళ్లి జరిగింది. ఇటీవల సనానాజ్ పండంటి ఆడబిడ్డకు జన్మినిచ్చింది. అయితే మగ బిడ్డ పుడితేనే తన వంశం ముందుకు సాగుతుందని అమానుల్లా తన భార్యకు తేల్చి చెప్పాడు. ఆడపిల్ల పుట్టినందు వల్ల తలాక్ చెప్పేశాడు. దీనిపై బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.