ఎర్రగొండపాలెం నుండి త్రిపురాంతకం వెళ్లే రహదారి నిత్యం ట్రాఫిక్ సమస్య ఏర్పడటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారి పెద్దగా ఉన్నప్పటికీ రోడ్డుకు ఇరువైపులా ద్విచక్ర వాహనాలు, తోపుడు బండ్లు రోడ్డుపై పెట్టడంతో తరచు ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుందని ప్రజలు అంటున్నారు. రెండు వైపుల ఇరుకుగా ఉంటడంతో వృద్దులు, చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు. దానికి తోడు ఆటోలు కూడా ఎక్కువ సేపు రోడ్డుపై పెట్టడటంతో ఇంకా సమస్య ఎక్కువుగా ఉంటుందని అంటున్నారు. పోలీస్ శాఖ అధికారులు స్పందించి ట్రాఫిక్ సమస్య లేకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.