ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో బుధవారం భక్తుల రద్దీ కొనసాగుతుంది. భక్తులు అధిక సంఖ్యలో ఒక్కసారిగా రావడంతో ఆలయం క్యూలైన్లు అన్ని నిండిపోయింది. స్వామివారి దర్శనార్థం సమయపాలన కావడంతో భక్తులు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. దేవస్థానం అధికారులు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పర్యవేక్షిస్తున్నారు.