గోరుచిక్కుడు సాగుకు 30-35 డిగ్రీల ఉష్ణోగ్రత అవసరం ఉంటుంది. ఇది ఉష్ణమండలపు పంట. వేడి వాతావరణంలో ఎక్కువగా సాగవుతుంది. మొలకెత్తే సమయంలో 30-35 డిగ్రీల ఉష్ణోగ్రత అవసరం ఉంటుంది. కొమ్మలు వచ్చే సమయంలో 32-38 డిగ్రీల ఉష్ణోగ్రత కావాలి. ఉదజని సూచిక 7-8.5 మధ్య ఉండి, మధ్యస్థ, తేలికపాటి నేలలు గోరు చిక్కుడు సాగుకు అనుకూలం. నీటి నిల్వ భూములు, నల్లరేగడి, గాలిలో తేమ ఎక్కువగా ఉండే ప్రాంతాలు అనుకూలంగా ఉండవు.