స్వచ్చ పులివెందులపై అవగాహన కల్పించాలని మున్సిపల్ కమిషనరు నరసింహారెడ్డి కోరారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ డాక్టర్ వరప్రసాద్ అధ్యక్షతన మంగళవారం పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తడిచెత్త, పొడి చెత్త, హానికర వ్యర్థాలను వేరు చేసి అందించే ప్రక్రియపై విద్యార్థులకు విరామ సమయంలో అవగాహన కల్పించాలన్నారు. దీని వల్ల కలిగే ప్రయోజనాలను ఆయన వివరించారు. స్వచ్చ పులివెందులపై విద్యార్థులల్లో మరింత అవగాహన కల్పిం చేందుకు పోటీ పరీక్షలు నిర్వహించాలన్నారు. తడిచెత్త పొడిచెత్త అందిం చే విషయమై విద్యార్థులు కూడా వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తారని, తద్వారా అనుకున్నది సాధించవచ్చని పేర్కొన్నారు. పోటీపరీక్షల్లో విజేతలకు బహుమతులు అంజేస్తామని వెల్లడించారు.