తాడేపల్లిలోని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయం బుధవారం ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. మంత్రి దాడిశెట్టి రాజా గన్మెన్ వేధింపులపై స్పందనలో ఫిర్యాదు చేసేందుకు మంగళ వారమే ఆరుద్ర అనే మహిళ ఇక్కడకు వచ్చింది. అయితే సీఎం జగన్ను కలిసేందుకు ఎంత ప్రయత్నించినా సాధ్యపడలేదు. దీంతో తీవ్ర ఆవేదనతో ఆమె చేతిని కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది.